- Step 1
ముందుగా అన్నం పొడి పొడి గ వండి పెట్టుకోవాలి, అలాగే స్వీట్ కార్న్ కూడా ఉడక పెట్టుకోవాలి
- Step 2
ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి సోంపు వేసి వేపాలి, అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి చీలికలు , కర్వేపాకు వేసి వేపాలి. అందులో ఇప్పడు అల్లం వెల్లుల్లి పేస్ట్ , సాల్ట్, పసుపు , వేసి కలిపి అందులో పుదీనా వేసి బాగా వేపాలి .
- Step 3
తరువాత ఇందులో బాయిల్ చేసుకున్న స్వీటీకార్న్ వేసి కలిపి . అందులో ఇప్పుడు మిరియాలపొడి , సోయాసాస్ వేసి కలపాలి.
- Step 4
అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నము వేసి కలిపి లాస్ట్ కొంచెం గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి దించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన స్వీటీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ….