- Step 1
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలు తీసుకుని , అందులో పసుపు, కారం, సాల్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిముషాలు పక్కన వుంచుకోవాలి. తరువాత పాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ ముక్కలు వేసి వేయించుకుని తీసుకోవాలి .
- Step 2
ఇప్పుడు వేరే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు , కరివే పాకు వేసి వేయించుకోవాలి.
- Step 3
అందులో క్యాబేజ్ తురుము , క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేపుకోవాలి . తరువాత ఇందులో పసుపు కారం సాల్ట్ వేసి కలుపుకోవాలి
- Step 4
ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ వేసి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి అన్ని ఒకసారి కలపాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి బాగా కలపి ఉల్లికాడ ముక్కలు, కొత్తిమీర నిమ్మరసం వేసుకొని పొయ్యి ఆపు చేసుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ ..