- Step 1
ముందుగా మటన్ తీసుకుని శుభ్రం గ కడిగి పెట్టుకోవాలి .
- Step 2
గోంగూర ఆకులను కూడా తెంచుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో మటన్ ముక్కలు , గరం మసాలా దినుసులు , అల్లం వెల్లుల్లిపేస్ట్ , పసుపు , కారం , సాల్ట్ , మటన్ ముక్కలు మునిగేంతవరకు వాటర్ వేసి కలిపి మూతపెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి …
- Step 4
చల్లారాక ముత తీసి పక్కనపెట్టుకోవాలి ..
- Step 5
ఇప్పుడు వేరే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో ముందుగా కడిగిపెట్టుకున్న గొంగూర ఆకులను , అల్లం వెల్లుల్లి పేస్ట్ , పసుపు , వేసివేపుకోవాలి వేగాక దించుకుని , చల్లరాక దీన్ని మిక్స్ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసిపెట్టుకోవాలి .
- Step 6
ఇప్పుడు వేరే పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చి చీలికలు , కర్వేపాకు వేసి బాగా వేపుకోవాలి , వేగాక అందులో ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ మిశ్రమం వేసి , అందులో జీలకర్ర పొడి , ధనియాలపొడి , వేసి కలిపి ఉడకనివ్వాలి.
- Step 7
ఉడికాకఅందులో ముందుగా చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి 5 నిముషాలు మగ్గించుకోవాలి , లాస్ట్ గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసి దించుకోవాలి …