- Step 1
ముందుగా ఆలుగడ్డలు ని బాయిల్ చేసి, తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి , చుక్కకూరను కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి .
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఆవాలు , జీలకర్ర , ఎండుమిర్చి , కర్వేపాకు , వేసి వేపుకోవాలి , వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి చీలికలు , వేసి వేపి అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ , పసుపు వేసి బాగా వేపుకోవాలి
- Step 3
వేగాక అందులో చుక్కకూర వేసి మగ్గనివ్వాలి , మగ్గాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి కలిపి ,కారం , ధనియాల పొడి వేసి 5 నిముషాలు వేగనివ్వాలి , ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి దించుకోవాలి …