- Step 1
చేపను శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కడిగి, ఒక గిన్నె లో చేప ముక్కలు , సాల్ట్ , పసుపు, కారం , వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
చింతకాయలు శుభ్రం గా కడిగి పెట్టుకోవాలి , స్టవ్ వెలిగించి గిన్ని పెట్టి అందులో చింతకాయలూ వాటర్ వేసి ఒక పది నిముషాలు ఉడకనివ్వాలి , చల్లారాక చింతకాయ రసం తీసుకుని పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని వేడి ఎక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి , వేగాక అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి వేపుకోవాలి .
- Step 4
వేగాక అందులో ముందుగా ఉప్పు, కారం రాసి పెట్టుకున్న చేపముక్కలు వేసుకుని ఒకసారి కలిపి అందులో ముందుగా చేసుకున్న చింతకాయల రసం వేసి కలిపి, అందులో ధనియాల పొడి, సాల్ట్ వేసి కలిపి.. కర్వేపాకు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మూత పెట్టి ఒక పదిహేను నిముషాలు ఉడకనివ్వాలి, తరువాత చిన్న మంట మీద ఇంకో 20 నిముషాలు ఉంచి, ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి దించుకోవాలి …
- Step 5
అంతే పుల్ల పుల్లని చింతకాయ చేపల పులుసు రెడీ ….. పులుపు బాగా ఇష్టం గా తినే వారు ఈ పులుసు ఇంకా ఇష్టం గా తింటారు .
- Step 6
చేప ముక్కలకి ఈ పులుపు బాగా పట్టాలి అంటే.. కూర వండిన ఒక మూడు గంటల తరువాత ఈ కూర వేడి వేడి అన్నం లో వడ్డించుకుని రుచి చుడండి.