- Step 1
ముందుగా బాదాం పప్పు ను 30 నిముషాలు వాటర్ లో వేసి నానపెట్టుకుని , వాటి తొక్క తీసేసి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి , అలాగే, ఖర్జురము ను కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి .
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి కాగాక అందులో బాదాం పలుకులు , జీడిపప్పు , కిస్మిస్ , ఖర్జురము అన్నివేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి .
- Step 3
అదే పాన్ లో సేమియా (సన్నవి) వేసి వేపుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 4
ఇప్పుడు అదే పాన్ లో మిల్క్ వేసి బాగా మరగనివ్వాలి , మరిగాక అందులో పంచదార వేసి ఒక రెండు నిముషాలు కలుపుకోవాలి , స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ముందుగా వేయించుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పొడి, కుంకుమపువ్వు వేసి కలిపి దించుకోవాలి ..అంతే స్వీట్ స్వీట్ షీర్ కుర్మా రెడీ …