- Step 1
ముందుగా చికెన్ తీసుకుని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి , అందులో సాల్ట్ , కారం , అల్లం వెల్లుల్లి పేస్ట్ , గరం మసాలా వేసి బాగా కలుపుకుని ఒక అర గంట పాటు పక్కన పెట్టుకోవాలి .
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో చికెన్ ముక్కలు వేసి రెండు వైపులా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి .
- Step 3
తరువాత వేరే పాన్ పెట్టి వాటర్ వేసి మరిగాక అందులో నూడుల్స్ వేసి బాయిల్ చేసి పక్కనపెట్టుకోవాలి .
- Step 4
ఇప్పుడు వేరే పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి కాగాక అందులో వెల్లుల్లిముక్కలువేసి వేగాక అందులో ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు , వేసి వేపుకోవాలి , వేగాక అందులో సాల్ట్ , మిరియాలపొడి , సోయాసాస్ , చిల్లీసాస్ , టమోటో సాస్ , అజినమోటో అన్ని వేసి కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి అందులో బాయిల్ చేసి పెట్టుకున్న నూడుల్స్ వేసి కలిపి ఒక సారి టాస్ చేసుకుని లాస్ట్ ఉల్లికాడలు ముక్కలు, కొత్తిమీర వేసుకుని దించుకోవాలి .