- Step 1
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, కారం, ధనియాలపొడి, మసాలపొడి, ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి తగినంత నీరు కలిపి జారుగా కలిపి పక్కనుంచుకోవాలి.
- Step 2
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ముందుగా కలిపిపెట్టుకున్న పునుగులా పిండిని తీసుకుని కొంచెం కొంచెం గా చేత్తో పుణుకులు లాగా వేసుకుని వేయించుకుని తీసుకోవాలి .
- Step 3
ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు, తగినంత నీరు, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయముక్కలు, కొంచెం శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర తురుము , సాల్ట్ అన్ని వేసి బాగా కలుపుకోవాలి .
- Step 4
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి ఎక్కాక నెయ్యి వేసి ఇంగువ వేసివేగాక ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి, బాగా వేగాక మజ్జిగ మిశ్రమాన్ని కలిపి 5 నిమిషాలపాటు సన్నని సెగమీద మరగ నివ్వాలి.
- Step 5
తరువాత ఈ మజ్జిగ పులుసులో పుణుగులను, వడ్డించుకోవడానికి 5 నిమిషాల ముందు వేసి నానబెట్టాలి.అంతే పుణుకుల పులుసు రెడీ