- Step 1
ముందుగా బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆ ముక్కలలో బేకింగ్ పౌడర్, శెనగపిండి, ఫుడ్ కలర్ వేసి ముక్కలు చిదమకుండా మెల్లగా కలుపుకోవాలి.
- Step 2
తరువాత స్టవ్ మీద నూనె పెట్టి కాగినాక ఈ బంగాళా దుంప ముక్కలు వేసి ఎర్రగా వచ్చే వరకు ఉంచి తీసేయ్యాలి.
- Step 3
తరువాత గట్టి పెరుగును తీసుకోని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి లను పొడవుగా కట్ చేసి ఉంచుకోవాలి.
- Step 4
తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి.
- Step 5
ఇప్పుడు అందులో అజీనామోటో, పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో చాట్ మసాల, ఉప్పు, కారం వేసి కలపాలి. నూనె పైకి తేలే వరకు వేయించి. చివరగా వేయించి పెట్టుకున్న బంగాళా దుంప ముక్కలు వేసి మరో రెండు నిముషాలు ఉంచి దించెయ్యాలి.