- Step 1
కందిపప్పు ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టు కోవాలి. తరువాత మునక్కాడ మరియు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
తరువాత ఒక గిన్నెలో సొరకాయ మునక్కాడ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి. సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తరువాత చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరో 10 నిముషాలు ఉడికించాలి.
- Step 3
తరువాత అందులో ఉడికించిన పప్పు వేసి బాగా కలిపి మరో గ్లాస్ నీళ్ళు పోసి, సరిపడ కారం, ఉప్పు, సాంబార్ పొడి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు గింజలు, ఎండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి.
- Step 4
తరువాత ఈ పోపుని మరుగుతున్న సాంబార్ లో వేసి కలిపి మరో 5 నిముషాలు మరిగించి దించెయ్యాలి. అంతే రుచికరమైన సొరకాయ సాంబార్ తయార్. ఈ సాంబార్ ని వేడి అన్నములో కాని ఇడ్లీలో కాని తింటే చాల రుచిగా ఉంటుంది.