- Step 1
ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి. అందులో మీల్‌మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
- Step 2
ఇప్పుడు వీటిని 10 నిమిషాలు నీళ్లలోనే ఉంచి, తరువాత వేరే పాత్రలోకి మీల్‌మేకర్‌ని తీసుకుని మెత్తగా చేయాలి.
- Step 3
అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.
- Step 4
బాణలిలో నూనె పోసి కాగాక పకోడీల మాదిరిగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే కర కరలాడే మీల్ మేకర్ పకోడీ రెడీ, వీటిని టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా ఉంటాయి.