- Step 1
చికెన్ శుభ్రంగా కడిగి, ఉప్పు, కారం , పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్కకూర శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి.
- Step 2
గోంగూరలో చుక్కకూర కలపడం వల్ల రుచి పెరుగుతుంది. జిగురుగా లేకుండా బాగుంటుంది.
- Step 3
కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా ఉడికించి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
- Step 4
మందపాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించాలి.
- Step 5
అందులో అల్లం వెల్లుల్లి ముద్ద , పసుపు, కారం వేసి కొద్దిగా వేపాలి. తర్వాత చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగ కలియబెట్టి మరి కొద్ది సేపు వేయించాలి.
- Step 6
రెండు గ్లాసుల నీళ్ళు పోసి పది నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూర ముద్ద వేసి కలిపి మరో పది నిమిషాలు ఉడికించి కొత్తిమిర, గరం మసాలా వేసి కలిపి దింపేయాలి.బిర్యానీలోకి, అన్నంలోకి, రొట్టెలలోకి కూడా ఈ కూర బాగుంటుంది.