- Step 1
ముందుగా ఒక పాత్ర లో వెన్న, పంచదార పొడి, యాలకులపొడి, మిరియాల పొడి, ఉప్పు, పాలు పోసి మృదువుగా కలిపి మిశ్రమం తయారుచేయాలి.
- Step 2
తరువాత మైదా, రాగిపిండి, కొబ్బరిపొడుల్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
- Step 3
ఇప్పుడు ఈ పిండి ని అరగంట వరకు దానిని గాలి చొరబడకుండా ఉండేలా ఒక పాత్రలో ఉంచాలి.
- Step 4
తరువాత చపాతీ పీట మీద ఈ పిండి మిశ్రమాన్ని వేసి, రెండు మడతల్లో అరంగుళం మందంగా ఉండేలా పెద్ద రొట్టెను చేసి, మనకు కావలసిన ఆకారంలోకట్ చేసుకోవాలి.
- Step 5
ఇప్పుడు నెయ్యి లేదా నూనె రాసిన లోతున్న ప్లేటులో వీటిని ఉంచి, ఇసుక పోసిన కుక్కర్‌లోగానీ మందపాటి పాత్రలో గానీ ఉంచి సుమారు పది నిమిషాల సేపు ఉడికించాలి.
- Step 6
అదే మైక్రోవేవ్ ఒవెన్‌లో అయితే 15 -20 నిమిషాల పాటు 360 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర బేక్ చేసి తీసేయాలి. అంతే టేస్టీ రాగి వీల్స్ తయార్.