- Step 1
ముందుగా బాస్మతి బియ్యం కడిగి కాస్త పలుకుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తర్వాత స్టవ్ వెలిగించి బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక పన్నీర్ ముక్కలను, జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి అది వేడి ఐన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- Step 4
తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కొంచెం సేపు వేయించాలి.
- Step 5
ఆ తర్వాత టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం, తగినంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి.
- Step 6
ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకొన్న పన్నీర్ జీడిపప్పు ముక్కలు, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలిసేలా కలబెట్టాలి. చివరగా తరిగిన కొత్తిమిర, తురిమిన కొబ్బరి కూడా చల్లి ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే నోరూరించే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.