- Step 1
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
పాన్ లో నూనె వేసి వేడిచేసి ఉల్లిముక్కలు, బాదం, జీడిపప్పు, గసగసాలు, కొబ్బరితురుము అన్నీ వేసి దోరగా వేయించుకొని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
- Step 3
చికెన్ లో నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ముందుగా రుబ్బుకున్న మసాలపేస్ట్, కుంకుమపవ్వు, అన్నీ వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫోయిల్ పేపర్ తో చుట్టూ కవర్ చేసి 30 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి.
- Step 4
పాన్ లో నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
- Step 5
ముందుగా మ్యారినెట్ చేసుకున్న చికెన్ కూడా వేసి 15-20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- Step 6
తరువాత నీళ్ళుపోసి పూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర, పుదీన వేసి దించాలి. నోరూరించే షహీ చికెన్ కుర్మా రెడీ.