- Step 1
బేసిన్‌లో మైదా, వంటసోడా, నెయ్యి, కారం, ఇంగువ, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా కలపాలి.
- Step 2
పైన మూత పెట్టి, పావు గంట ఉంచాలి. పిండిముద్దను కావలసిన పరిమాణంలో తీసుకొని, చపాతీలా ఒత్తుకోవాలి. కావలసిన షేప్‌లో కట్ చేయాలి.
- Step 3
స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత కట్ చేసినవాటిని అందులో వేసి, రెండువైపులా కాల్చి, తీయాలి.
- Step 4
టిష్యూ పేపర్‌లో వేస్తే, అదనపు నూనె పీల్చుకుంటుంది. ఈ కారా బిస్కెట్లను డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు.
- Step 5
నోట్: కారం బదులు మిరియాల పొడి, జీలకర్ర పొడి... ఈ బిస్కెట్లకు రకరకాల ఫ్లేవర్లు జత చేయవచ్చు.