Step 1
ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పాల పొడి, బ్రెడ్ ఇంప్రూవర్, బటర్, పాలు, గుడ్డు సొన, ఈస్ట్, తేనె వేసి కలపాలి. పిండి ముద్దగా అయ్యాక పైన మరొక గిన్నె మూత పెట్టి ఫ్రిజ్‌లో 30 నిమిషాల తరవాత పిండి బయటకు తీయాలి. కావలసినంత పరిమాణం పిండి తీసుకొని, డో షేప్ చేయాలి. రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేంతవరకు ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న డోన ట్స్‌ను వేసి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నంతసేపూ సన్నని మంట ఉండేలా చూడాలి. బయటకు తీసి, చల్లారిన తర్వాత షుగర్ ఫ్రీ చాక్లెట్ తురుము, పిస్తాపప్పుతో అలంకరించాలి.