- Step 1
టొమాటోలను శుభ్రపరిచి, క్లాత్‌తో తడిలేకుండా తుడవాలి.
- Step 2
టొమాటో పై భాగంలో క్యాప్‌లాగ కట్ చేయాలి.
- Step 3
స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- Step 4
టొమాటోను కట్ చేసిన పై ముక్కను తరిగి, పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఇందులో కలిపి, ఉడికించాలి.
- Step 5
పనీర్ తురుము వేసి మరో నిమిషం ఉడికించాలి.
- Step 6
టొమాటో కప్పులను ఈ మిశ్రమంతో నింపాలి.
- Step 7
పైన చీజ్ తురుము, కొత్తిమీర తరుగు వేయాలి.
- Step 8
పెజర్ కుకర్ పాన్‌లో బటర్ వేసి, కరిగాక టొమాటో కప్పులను అందులో ఉంచి, ఉడికించి, దించాలి. (అవెన్‌లో అయితే 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాలు బేక్ చేయాలి)
- Step 9
స్టఫ్డ్ పనీర్ టొమాటో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.