- Step 1
ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి స్టౌ మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి.
- Step 2
కాసేపటికి మిశ్రమం గట్టిపడుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో పాల పొడి, కరిగించిన నెయ్యి, కండెన్స్‌డ్ మిల్క్ వేసి కలిపి, అవెన్‌లో పదిహేను నిమిషాలు ఉంచాలి.
- Step 3
అవెన్‌లో నుంచి పాలపొడి మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది.
- Step 4
కొబ్బరి మిశ్రమం చిన్న ఉండలు(నిమ్మకాయ పరిమాణం)గా చేయాలి. కోవా చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, అరచేతి వెడల్పుగా ఒత్తి, మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి, మళ్లీ ఉండలా చేయాలి.
- Step 5
నోట్: మౌల్డ్ సాయంతో చేయడం లేదా చేత్తో మోదక్‌లాగ చేసి, సన్నని పుల్లతో నిలువుగీతలు పెట్టాలి.