- Step 1
బాదం పలుకులు, కిస్‌మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి.
- Step 2
నెయ్యి కొద్దిగా వేడయ్యాక గోధుమపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి చక్కగా వేగేంతవరకు కలుపుతూనే ఉండాలి.
- Step 3
అవెన్‌లో నుంచి పాలపొడి మిశ్రమం తీసి, గరిటతో బాగా కలిపితే కోవా ముద్దగా అవుతుంది.
- Step 4
మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించాలి. అందులో ఏలకుల పొడి వేసి, తర్వాత గోధుమపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి.
- Step 5
మరొక పాన్‌లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన గోధుమపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్‌మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి.