- Step 1
బాదం పలుకులు, కిస్‌మిస్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టాలి. పాన్‌లో నెయ్యి వేసి, కరిగించాలి.
- Step 2
నెయ్యి కొద్దిగా వేడయ్యాక శనగపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి. పిండి కొద్దిగా గోధమ వర్ణంలోకి వచ్చేంతవరకు వేయించాలి.
- Step 3
పిండి వేగుతుంటే మంచి సువాసన వస్తుంటుంది. మరొక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, బొంబాయి రవ్వను వేయించి, అందులో ఏలకుల పొడి కలపాలి.
- Step 4
తర్వాత శనగపిండి, బొంబాయి రవ్వ కలిపి, మరికాసేపు వేయించాలి.
- Step 5
మరొక పాన్‌లో పంచదార, శాఫ్రన్ కలర్ కలిపి, వేడి చేయాలి. వేయించిన శనగపిండి, రవ్వ మిశ్రమాన్ని పంచదార మిశ్రమంలో కలిపి, బాదంపప్పు, కిస్‌మిస్ వేయాలి. ఈ పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులతో గట్టిగా అదుముతూ లడ్డూలు కట్టాలి.