- Step 1
శుభ్రం చేసుకున్న ఉలవల్ని నూనె లేకుండా మందపాటి మాత్రలో బాగా వేయించాలి.
- Step 2
వేగాక పక్కకు తీసి ఉంచి, శనగపప్పు వేయించాలి.
- Step 3
శనగపప్పు వేగాక దింపేముందు నువ్వులు వేసి కొద్ది సేపు వేయించి తీసి పెట్టాలి.
- Step 4
కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు,కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
- Step 5
అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి.
- Step 6
చల్లారాక మిక్సి జార్‌లో తీసుకుని తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.
- Step 7
ఉలవలతో పొడి చేసుకుని, కంది పొడి, చనిక్కాయల పొడి లాగా అన్నంలోకి, ఇడ్లీ,దోశలలోకి తినడానికి బాగుంటుంది.