- Step 1
ముందుగ మామిడికాయ ముక్కలను తురిమి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
ఎండు మిరపకాయలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఆవాలు, మెంతులను కూడా వేయించుకోవాలి.
- Step 4
ఎక్కువ వేగకుండా జాగర్త పడాలి. ఎక్కువ వేగితే పచ్చడి చేదు వస్తుంది.
- Step 5
ఇంగువ వేసుకొని అన్నిటిని కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చేసుకొన్న పొడిని, ఉప్పు ని మామిడికాయ తురుముతో కలుపుకోవాలి.
- Step 6
రోట్లో అయిన దంచుకోవచు లేదా grinder లో వేసి ఒకసారి తిప్పి కలపచ్చు
- Step 7
ఒక బాండలి లో నాలుగు గరిటెల నూనె పోసి కాగ పెట్టుకోవాలి.
- Step 8
నూనె వేడి చేసాక అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
- Step 9
ఈ నూనె ని చేసుకొన్నా మామిడికాయ తురుములో కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. నూనె పైకి తేలాలి. ఎందుకంటే పచ్చడి నూనె ని మొత్తం పీల్చు కుంటుంది.