- Step 1
వంకాయలను నాలుగు భాగాలుగా సగం వరకు కోసుకోవాలి. మొత్తం కోయకూడదు.
- Step 2
ఇప్పుడు మధ్యలో వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు (వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు తయారీ విధానము కోసం కింద చూడండి ) ని కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 3
ఇప్పుడు చింతపండు ని వేడి నీళ్ళల్లో ఐదు నిముషాల పాటు నాన పెట్టాలి. తరువాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 4
ఇప్పుడు ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి , ఉల్లిపాయలు కొంచం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
- Step 5
అందులో తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఉడికేంత వరకు వేయించాలి.
- Step 6
ఇప్పుడు చేసుకొన్న చింతపండు రసం ని కూడా వేసుకోవాలి.
- Step 7
అందులో తగినంత ఉప్పు, కారం పసుపు వేసి కలిపి 2 నిముషాల తరువాత వేరుశెనగపప్పు కొబ్బరి పేస్టు ని కూర్చుకొని వంకాయలను కూడా వేసుకోవాలి ,
- Step 8
దీనిని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అంతే గుత్తి వంకాయ కూర తయారు