- Step 1
ముందుగా తగినన్ని నీళ్లు పోసి చింతపండు నానబెట్టుకోవాలి .
- Step 2
ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి సేమ్యాను ఉడికించి, వార్చి, వెడల్పాటి ప్లేట్లో వేసి, విడదీసి ఆరనివ్వాలి.ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఉప్పువేసి, ఉడికించి, చల్లారనివ్వాలి.
- Step 3
తరువాత చింతపండు గుజ్జును, ఉడికించినా సేమ్యాకు పట్టించి, పక్కన పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి, నూనె పోసి, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి.
- Step 4
తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సమంగా వేగనివ్వాలి.
- Step 5
చివరిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి . ఈ పోపును పక్కన పెట్టుకున్న సేమ్యాలో వేసి కలిపి . అంతే సేమ్యా పులిహోర తయారు