- Step 1
ముందుగ టోఫు ని చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవలెను.
- Step 2
ఒక పాన్ లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
- Step 3
అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
- Step 4
ఇప్పుడు పసుపు,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఇంకో రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
- Step 5
ఇందులో టోఫు వేసి ఒక నిఉమ్శం పాటు వేయించుకోవాలి.
- Step 6
ఇందులో తరిగి ఉంచుకున్న కాప్సికం ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి.
- Step 7
తగినంత కారం, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిముషాల పాటు ఉడక పెట్టుకోవాలి.
- Step 8
కొబ్బరి పాలు కూడా వేసి మూత పెట్టి పదిహేను నిముషాల పాటు medium మంట మీద ఉడికించుకోవాలి.
- Step 9
ఆఖరున గరం మసాల పొడి చల్లి ఇంకో నిముషం పాటు ఉడికించాలి. కొత్తిమీర చల్లి వేడి వేడి టోఫు కాప్సికం కర్రీ రెడీ.