- Step 1
చికెన్‌ను శుభ్రం చేసి, ముక్కలుగా కోసి కాస్త పసుపు పట్టించి పక్కన వుంచాలి.
- Step 2
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటా, అన్నింటినీ గ్రైండ్ చేసుకుని దానికి తగినంత ఉప్పు కలిపి, ఆ పేస్ట్‌ను చికెన్ ముక్కలకు పట్టించాలి.
- Step 3
ముక్కలను అరగంట పాటు అలా వదిలేయాలి. ఆపై పాన్‌లో నెయ్యి వేసి చికెన్ ముక్కలు వేయాలి.
- Step 4
కాస్త వేగాక కార్న్‌ఫ్లోర్, సోయాసాస్, వెనిగర్ మూడు కలిపిన మిశ్రమాన్ని వేయాలి.
- Step 5
ఆ తరువాత ఒక స్పూను నూనె, పెరుగు వేయాలి. బాగా కలియపెట్టిన తరవాత మిరియాల పొడి జల్లాలి.
- Step 6
మరోసారి కలియపెట్టి సన్నటి సెగపై మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత కొత్తిమీర జల్లి దింపుకోవాలి.