- Step 1
చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపేసి తడి అరనివ్వాలి.
- Step 2
పైన శుభ్ర పరచి పెట్టుకొన్న చికెన్ లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మైదా,కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, కొత్తిమిర వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి పకోడీల్లా ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
తర్వాత వెడల్పాటి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వేయించిన ముక్కలను అందోలో వేసి వేపాలి.
- Step 4
ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, మిరియాలపొడి, సోయా సాస్ వేసి బాగా కలపాలి.
- Step 5
ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి బాగా ఉండలు కట్టకుండా కలపాలి తర్వాత వేగుతున్న చికెన్ లో వేసి బాగా ఉడికించాలి.
- Step 6
ఫైనల్ గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 10 నిమిషాలు ఉడికించి దింపేయాలి.