- Step 1
మొదట పీతలను వేడి నీటిలో 10 నిమిషాలు ఉడికించి పైన ఉన్న పొట్టు(డొల్ల)ను తొలగించి పిడుపును మాత్రం తీసి పక్కన పెట్టుకొవాలి.
- Step 2
తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- Step 3
వెల్లుల్లి, అల్లం గ్రైడ్ చేసి పేస్టును తయారు చేసి పెట్టుకొని స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేయాలి.
- Step 4
నూనె కాగిన తర్వాత కట్ చేసి ఉంచుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు అందులో వేసి దోరగా వేగనివ్వాలి.
- Step 5
తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా సన్నని మంట మీద వేపాలి.
- Step 6
ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కరివేపాకు, నూనె, పీతలు, కారం, ఉప్పు వేసి కావాలనుకుంటే మరికొద్దిగా నూనెను జత చేసి కొద్దిగా నీరు పోసుకోవచ్చు.
- Step 7
ఈ మిశ్రమాన్నంతా స్పూన్ తో కలియ బెడుతూ 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
- Step 8
అలా తయారైన పీతల పిడుపు గుజ్జుకు కొత్తిమిర చల్లి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ పీతల పిడుపును చెపాతీలకి మంచి కాంబినేషన్. మరి మీరు ట్రై చేసి చూడండి.