- Step 1
అరటికాయల చెక్కుతీసి అంగుళం పొడవు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. నీటిలో ఉడికించి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
మూకుడులో మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేడిచేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరితురుము ఒకదాని తరువాత ఒకటిగా వేసి రంగు మారి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
- Step 3
చాలినంత నీరుపోసి రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి.
- Step 4
మూకుడులో మిగతా నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి.
- Step 5
ఉల్లిపాయలు వేసి రంగుమారే వరకు వేయించాలి. అరటికాయ ముక్కలేసి 2 నిమిషాలు వేయించి రుబ్బినపేస్టు. చింతపండు గుజ్జు, బెల్లం, తురుము, ఉప్పు, ఒకకప్పు నీరు కలపాలి. నీరింకాచిక్కబడే వరకు ఉడికించాలి. వేడివేడిగా వడ్డించాలి.