- Step 1
ముందుగా కోల్‌స్లా తయారుచేసుకోవాలి.
- Step 2
ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్, పావుకప్పు కాప్సికమ్‌కి ఒక కప్పు మెయోనేస్‌ని కలపాలి. దీన్నే కోల్‌స్లా అంటారు.
- Step 3
తరువాత వెజ్ ప్యాటీస్ తయారుచేసుకోవాలి. సన్నగా తరిగిన కూరగాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి.
- Step 4
ఇందులో కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. దీన్ని ఉండలుగా చేసుకుని కొద్దిగా వెడల్పుగా ఒత్తుకోవాలి.
- Step 5
అంతే వెజ్ ప్యాటీస్ రెడీ. మరో గిన్నెలో మొక్కజొన్న పిండి వేసి అందులో పాలు కలుపుకుని వెజ్ ప్యాటీస్‌ని రెండు వైపులా ముంచి, వెంటనే బ్రెడ్ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు బన్ను తీసుకుని ముందు టమోటా కెచిప్ రాయాలి.
- Step 6
తరువాత రెండు టేబుల్ స్పూన్ల కోల్‌స్లా వేసి, దానిపైన టమోటా ముక్కలు, వెజ్ ప్యాటీస్, చీజ్ ముక్కలు, పెరుగు వేసి రెండవ బన్ పెన బోర్లిస్తే బ్రెడ్ బర్గర్ తయారయినట్టే.