- Step 1
బియ్యం, మినపప్పు కలపి ముందురోజు నానబెట్టుకోవాలి.
- Step 2
తరువాతి రోజు వీటని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. క్యారెట్‌ని సన్నగా తురుముకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి.
- Step 3
ఇందులో యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ని నీళ్లలో ముంచి గట్టిగా పిండేయాలి.
- Step 4
దీన్ని క్యారెట్ తరుములో కలుపుకోవాలి. కొద్దిగా వేగాక పంచదార కూడా వేసి బాగా కలిపి దించేయాలి.
- Step 5
దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- Step 6
ఇప్పుడు మెత్తగా రుబ్బి పెట్టుకున్న బియ్యం, మినపప్పు పిండిలో కొద్దిగా సోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి.
- Step 7
ఈ పిండిలో బ్రెడ్ ఉండల్ని ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే బ్రెడ్ పూర్ణాలు రెడీ.