- Step 1
బోన్‌లెస్ చికెన్ ముక్కలనును చిన్నగా కోసి వాటికి తగినంత ఉప్పు, కారం, పసుపు, పెరుగు కలిపి నానబెట్టాలి.
- Step 2
ఆపై క్యాప్సికమ్‌ను ,ఉల్లిపాయలను ముక్కలుగా తరగాలి. అల్లం, వెల్లుల్లి ముక్కలు చాలా చిన్నగా తరిగి ఉంచండి.
- Step 3
ప్యాన్‌లో నూనె పోసి పొయ్యిమీద పెట్టి ముందుగా అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసి కొంచెం వేయంచాక- క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని వేసి, అయదు నిమషాలు వేయంచాలి.
- Step 4
నానబెట్టి ఉంచిన చికెన్‌ను కలిపి, కొంచెం పెద్ద మంట మీద కలుపుతూ ఉండాలి.
- Step 5
చికెన్ మెత్తబడగానే టమోటా ముక్కల్ని కూడా కలిపి మూతపెట్టాలి.ఆపై పచ్చిమిర్చి, గరంమసాలా, ధనియాల పొడులు కలిపి కొంచెం సేపు ఉడికించి, దించేముందు కొత్తమీర జల్లాలి.