- Step 1
ముందుగా అంజూర్, ఎండుద్రాక్ష, కిస్‌మిస్, జీడిపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన వుంచాలి.
- Step 2
బియ్యం కడిగి ఉడికించి, పక్కన వుంచాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ముక్కలను దోరగా వేయించాలి.
- Step 3
వాటిని పక్కన వుంచి అదే బాణలిలో బటర్ వేసి, ఆపై ఉడికిన అన్నం వేసి కాస్సేపు కలియపెట్టాలి.
- Step 4
ఆ తరువాత దళసరి పాన్ లేదా గినె్నలో పాలు వేసి, కలుపుతూ పది, లేదా పదిహేను నిమషాల పాటు మరిగించాలి.
- Step 5
పాలు మరుగుతుండగానే డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి కలపుతూ, ఉడకనివ్వాలి.
- Step 6
ఆపై తగినంత పంచదార వేసి, కరిగాక, ఉడికిన అన్నం వేసి, సన్న సెగన అయిదు, లేదా పదినిమషాల పాటు కలుపుతూ వుంచాలి.
- Step 7
ఆపై యాలకల పొడి వేయాలి. సరియైన కుంకుమ పూవు లభిస్తే కనుక ఒక్కటి లేదా రెండు పూసలు వేయాలి. దీంతో మంచి రంగు, సువాసన వస్తుంది.