- Step 1
రొయ్యలను ముందుగా శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- Step 2
స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసి ఎర్రగా తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి తురుము వేసి వేయించాలి.
- Step 3
ఇప్పుడు రొయ్యలను వేసి ఎర్రగా వేగనివ్వాలి తర్వత గసగసాల పొడి, కారం పొడి, జిలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేసి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- Step 4
అందులో నీరంతా ఇమిరాక కొద్దిగా గరం మసాలా చల్లి, తరిగిన కొత్తిమీర వేసి దింపుకోవాలి అంతే టేస్టీ రొయ్యల వేసుడు రెడీ.