- Step 1
ముందుగా తాజాగా ఉన్న పచ్చి రొయ్యలను శుభ్రం చేసి దానికి ఉప్పు కారం కలిపి ఉంచు కోవాలి.
- Step 2
టమాట మెత్తగా పిసికి దాని గుజ్జును రెండు కప్పులకు సరిపడ తీసిఉంచుకోవాలి.
- Step 3
బాణాలిలో నూనె పోసి కాగినాక అందులో రొ య్యలను దోరగా వేయించి పక్కన ఉంచు కోవాలి.
- Step 4
తర్వాత అదే నూనెలో ముద్దగా చేసు కుని ఉంచుకున్న ఉల్లిపాయలను వేయించా లి.
- Step 5
అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయించాలి
- Step 6
కారం, ముద్దగా చేసుకున్న పచ్చి మిర్చిని, అల్లం, వెల్లుల్లి సన్నగా తురుముకుని ఆ మిశ్రమాన్ని కూడా అందులోనే వేసు కోవాలి.
- Step 7
తర్వాత టమాట జ్యూస్ మిశ్రమాన్ని అందులో కలపాలి.
- Step 8
ఇప్పుడు ఆ గ్రేవీలో వేయించి వుం చిన రొయ్యలను వేయాలి.
- Step 9
అవ సరం అ ను కుం టే మరికా స్త ఉప్పు రుచి కి సరిపడ వేసుకోవాలి.
- Step 10
కొద్దిసేపు ఉడికినాక అందులో కసూరి మేథీ, గరంమ సాలా, జీడి పప్పు పొడి వేసి బాగా కలియబెట్టాలి.
- Step 11
కూర దించుకునేముందు మిల్క్ క్రీమ్ కలుపు కోవా లి. కూర ను కిం దికిదించిన త ర్వాత దా ని పై తురి మిన కొత్తిమీర జల్లుకోవాలి.