- Step 1
పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించాలి.
- Step 2
చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. దుంపముక్కలలో పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి.
- Step 3
మరొక కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేగాక కరివేపాకు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, కారం, పసుపు వేసి ఉడికించాలి.
- Step 4
దీంట్లో పేస్ట్ చేసిన మిశ్రమం వేసి, కొద్దిగా నీళ్లు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి.
- Step 5
ఉడికించిన దుంప ముక్కలను పై మిశ్రమంలో కలిపి, బెల్లం వేయాలి. చివరగా గుండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేయాలి.