- Step 1
స్టౌ మీద కడాయి పెట్టి, వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి.
- Step 2
తర్వాత ఇంగువ కలిపి, పొడి చేయాలి. బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి.
- Step 3
తర్వాత అన్నం వండి పక్కన ఉంచాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి.
- Step 4
తర్వాత సాంబార్ ఉల్లిపాయలు వేసి మూడు నిమిషాలు ఉంచాలి.
- Step 5
ఉల్లిపాయలు ఉడికిన తర్వాత కారం, చింతపండు గుజ్జు, ఉప్పు, తమలపాకుల తరుగు వేసి పది నిమిషాలు ఉడికించాలి.
- Step 6
తర్వాత అన్నం, మినప్పప్పు పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర, వేయించిన నువ్వులు, కరివేపాకుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.