- Step 1
స్టౌ పై పాన్ పెట్టి, 50 ఎం.ఎల్ నూనె పోసి, వేడయ్యాక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి.
- Step 2
తర్వాత ధనియాలపొడి, పసుపు, చింతపండుగుజ్జు వేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేయాలి.
- Step 3
మరొక మందపు గిన్నెను స్టౌ మీద పెట్టి 150 ఎం.ఎల్ నూనె పోసి, ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
- Step 4
అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు పోయాలి. మటన్ ఉడికిన తర్వాత పేస్ట్ చేసిన మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి, కలిపి, ఉడికించాలి.
- Step 5
వాసన ఘుమఘుమలాడుతుండగా చేపముక్కలు వేసి, నాలుగు నిమిషాలు ఉంచి, గరం మసాలా, కొత్తిమీర చల్లి దించాలి.