- Step 1
బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- Step 2
పిండిలో ఉప్పు, బేకింగ్ సోడా, బటర్ వేసి, తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలిపి పక్కనుంచాలి.
- Step 3
పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి వేయించాలి.
- Step 4
తర్వాత అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బంగాళదుంప ముక్కలు వేసి వేయించి దించాలి.
- Step 5
పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకొని పీట మీద కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి.
- Step 6
ట్రయాంగిల్ వచ్చేలా కట్ చేసుకోవాలి. నీళ్లను అద్దుకుంటూ కోన్ షేప్ చేసి, అందులో ఉడికించిన బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి.
- Step 7
వీటిని కడాయిలో నూనె కాగిన తర్వాత వేసి రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించి, తీయాలి.
- Step 8
వేడి వేడిగా టొమాటో లేదా సోయా సాస్‌తో సర్వ్ చేయాలి.