- Step 1
బాణలిలో కొద్దిగా నూనె కాగాక అందులో పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి.
- Step 2
తరవాత, అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి పుట్నాలపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- Step 3
మళ్లీ అదే బాణలిలో మరికాస్త నూనె వేసి అందులో కరివేపాకు, పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు వేసి అందులో అటుకులు కూడా వేసి గుల్లగా వేయించుకోవాలి.
- Step 4
మరో పెద్ద పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, వేయించి ఉంచుకున్న పదార్థాలు కూడా వేసి బాగా కలపాలి.
- Step 5
మిరప్పొడి వేసి మరోమారు కలిపిన తర్వాత అందులో నిమ్మరసం, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.
- Step 6
చివరగా స్వీట్‌కార్న్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి వెంటనే తినేయాలి. లేదంటే మెత్తపడిపోతాయి.