- Step 1
నాటు కోడి ముక్కలను ఒక్క గిన్నెలోకి తీసుకొని, దానిలో కార్న్‌ఫ్లోర్, మైదా, గుడ్డుసొన వేసి కలపాలి.
- Step 2
కడాయిలో నూనె పోసి, కాగాక, కలిపి పెట్టిన కోడి ముక్కలను రెండు వైపులా వేయించి తీయాలి.
- Step 3
మరొక కడాయిలో కొద్దిగా నూనె వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
- Step 4
తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని సగానికి విరిచి వేయాలి. వేగిన తర్వాత పెరుగు, చల్లీసాస్, టొమాటో సాస్, మిరియాలపొడి వేసి కలపాలి.
- Step 5
మంట తీసేసి పై మిశ్రమంలో వేయించిన కోడి ముక్కలను వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.