- Step 1
కోడి మాంసం కావలసిన పరిమాణంలో కట్ చేసి ఉంచుకోవాలి. .
- Step 2
ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
- Step 3
కోడి మాంసానికి పసుపు, మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
- Step 4
మరో స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన కోడిమాంసాన్ని వేసి వే యించాలి.
- Step 5
దించే ముందు ధనియాల పొడి, కొత్తిమీర చల్లాలి.