- Step 1
బాదం పప్పును నీళ్లలో మూడు గంటల సేపు నానబెట్టాలి.
- Step 2
జల్లెడలో వేసి, నీళ్లన్నీ పోయిన తర్వాత బాదంపప్పు పై పొట్టు తీయాలి.
- Step 3
వీటిని మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. దీంట్లో పంచదార వేసి, మరోసారి గ్రైండ్ చేయాలి.
- Step 4
ఈ పిండిని అచ్చులలో పోసి, అవెన్‌లో బేక్ చేసి, బేస్ తయారు చేసుకోవాలి.
- Step 5
విడిగా నానబెట్టి, పొట్టు తీసిన బాదం పప్పులను రెండు పలుకులుగా చేయాలి. ఈ పలుకులను నేతిలో వేయించాలి.
- Step 6
చల్లారిన తర్వాత బాదం పిండి, పంచదార కలిపి తయారుచేసుకున్న బేస్‌లో ఒకదాని తర్వాత ఒకటి గుచ్చి, పువ్వులా తయారుచేసుకోవాలి.