- Step 1
పిస్తా పప్పును నీళ్లలో నానబెట్టి, బయటకు తీయాలి. నీళ్లన్నీ ఆరిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి.
- Step 2
అందులో 35 గ్రా. పంచదార వేసి మళ్లీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- Step 3
బాదంపప్పును నీళ్లలో మూడు గంటల సేపు నానబెట్టి, బయటకు తీయాలి.
- Step 4
నీళ్లన్నీ ఆరి పోయిన తర్వాత బాదంపప్పు పై పొట్టు తీయాలి.
- Step 5
వీటిని మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. దీంట్లో పంచదార వేసి, మరోసారి గ్రైండ్ చేయాలి.
- Step 6
అచ్చులలో ఒక లేయర్ పిస్తాపప్పు పిండి, ఒక లేయర్ బాదంపప్పు పిండి వేసి, అవెన్‌లో పెట్టి బేక్ చేయాలి.
- Step 7
బాదంపప్పు పలుకులు, పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేయాలి.