- Step 1
పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి.
- Step 2
తరువాత ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
- Step 3
ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన చికెన్ వేసి సన్నని మంటపై వేగించాలి.
- Step 4
చివర్లో కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి దించేయాలి.
- Step 5
మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూను నూనె, కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకుని చపాతీలు చేసుకోవాలి.
- Step 6
చపాతి మధ్యలో ఒక టేబుల్ స్పూను చికెన్ వేపుడు పెట్టి నాలుగు వైపులా మడత వేసి గొట్టంలా చుట్టుకోవాలి.
- Step 7
మడత ఊడిపోకుండా ఉండడానికి జారుగా కలుపుకున్న మైదా పిండిని మడత దగ్గర పూయాలి. ఈ రోల్స్‌ని నూనెలో వేగించుకోవాలి. చికెన్‌రోల్స్ రెడీ అయినట్టే.