- Step 1
కుకర్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
- Step 2
అందులో పసుపు, కారం, గరం మసాలా, చికెన్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి.
- Step 3
తర్వాత కొద్దిగా నీరు పోసి, కుకర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక దింపేసి చల్లారనివ్వాలి.
- Step 4
తర్వాత గ్రైండ్ చేయాలి. పండుమిరప కాయలను మరిగే నీళ్లలో వేసి చల్లారనివ్వాలి.
- Step 5
తర్వాత మైదాపిండిలో కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా నూనె అద్దు కొని కలిపితే పిండి మృదువుగా వస్తుంది.
- Step 6
పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని పూరీలా వత్తాలి. తర్వాత పూరీని కత్తితో సన్న సన్నని రిబ్బన్లుగా కట్ చేయాలి.
- Step 7
మిర్చీకి గాటు పెట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని నింపాలి. ఇలా నింపిన మిర్చీని కట్ చేసిన పూరీ రిబ్బన్ల మీద ఉంచి రోల్ చేయాలి.
- Step 8
దీనిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి