- Step 1
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- Step 2
తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
- Step 3
ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి.
- Step 4
తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి.
- Step 5
ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి.
- Step 6
ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి.
- Step 7
ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.