- Step 1
ముందుగా పొట్టేలు తలకాయ మాంసంను, ఉప్పు కలిపి కుక్కర్‌లో వేసి అందులో లీటర్ నీరు పోసి స్టౌ మీద పెట్టాలి.
- Step 2
ఆరేడు విజిల్స్ వచ్చాక కుక్కర్‌ను స్టౌ మీద నుండి దించేయాలి.
- Step 3
కొంత మంది కుక్కర్ కాకుండా పెద్దగిన్నెలోకి మాంసంను తీసుకొని కట్టెల పొయ్యి మీద బాగా ఉడికిస్తారు.
- Step 4
అలా ఉడికించిన కూర చాలా రుచిగా ఉంటుందని సీమగ్రామాల్లో పెద్దలు చెప్తారు.
- Step 5
అలా ఉడికించిన మాంసాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోయాలి.
- Step 6
ఆ తర్వాత నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొట్టేలు మెదడు (బ్రెయిన్) వేసి ఉడికించుకోవాలి.
- Step 7
కుక్కర్‌లో ఉడికించిన మాంసంలోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరిపొడి, మిర్యాలపొడి, ధనియాల పొడి, కారంపొడి వేసి బాగా ఇగరనిచ్చి దించేయాలి. ఇప్పుడు పొట్టేలు తలకూర రెడీ.