- Step 1
ముందుగా కాకరకాయలు కడిగి చివరలు కట్ చేసి గిన్నెలో వేసుకోవాలి.
- Step 2
అందులో కొంచం పెరుగు , చింత పండు , 1 గ్లాస్ నీరు పోసి ఉడికించి పెట్టుకోవాలి.
- Step 3
అవి ఆరిన తరువాత ఒకవైపు నిలువు చీలి గింజలు తీసి వేయాలి . పాన్లో ఆయిల్ వేసి ఈ ఉడికించిన కాకరకాయలు ఎర్రగా వేయించి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
- Step 4
స్టఫ్ చేయడానికి వేరు శనగ , నువ్వులు వేయించి కొబ్బరి కూడా కలిపి మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి.
- Step 5
విడిగా వెల్లుల్లి, జీలకర్ర గ్రైండ్ చేసి అంత ఒక ప్లేటులో వేసి అందులో కారం , ఉప్పు తగినంత వేసి కొంచం ఆయిల్ వేసి కలుపుకోవాలి.
- Step 6
ఈ పొడిని వేయించి ఉంచిన కాకరకాయలో స్టఫ్ చెయ్యాలి . ఇది రైస్ లో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది